సంగెం ముమ్మిడివరం గ్రామంలోని సిద్ధార్థ పాఠశాలలో శనివారము ముందస్తుగాశ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి.. ఈ సందర్భంగా పాఠశాల లోని విద్యార్థిని విద్యార్థులు శ్రీకృష్ణుడు మరియు గోపికల వేషధారన లు ఆకట్టుకున్నాయి. అనంతరము విద్యార్థులు ఉట్టి కొట్టి బహుమతులను గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి. సుధాకర్, ఇన్చార్జి పిజా నాస్, టీచర్స్ నాగమణి వందన స్వప్న మౌనిక కవిత శాంతకుమారి నర్మద రజని వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.


