*పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు* హన్మకొండ//పరకాల నియోజకవర్గం జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 24 పరకాల ప్రతినిధి:-
ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు. పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, నార్లాపూర్ మాజీ ఉప సర్పంచ్ కొమరవెల్లి సదానందం, గౌడ సంఘం నాయకులు ఒనగోని చంద్రమౌళి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి సమక్షంలో శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు లోనై బిఆర్ఎస్, బిజెపి నాయకులు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని పిలుపునిచ్చారు.