Jaibharathvoice.com | Telugu News App In Telangana
హైదరాబాద్ జిల్లా

వరంగల్ నగరంకు నూతన మాస్టర్ ప్లాన్ తక్షణమే సిద్ధం చేయాలి


జై భారత్ వాయిస్ వరంగల్ ఆగస్టు 24
వరంగల్ పట్టణాన్ని మరో నగరంగా తీర్చిదిద్దడానికి నూతన మాస్టర్ ప్లాన్ తక్షణమే సిద్ధం చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం రోజున డా. బి.ఆర్. అంబేద్కర్ సచివాలయం లోని తన కార్యాలయ సమావేశ మందిరంలో కుడా (కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) అధికారులు, పలు శాఖల అధికారులతో వరంగల్ నగర అభివృద్ధి పై సమీక్షంచారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్ నగరం తర్వాత వరంగల్ పట్టణాన్ని అభివృద్ధి పరచడానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసేందుకు పలు మార్లు సమావేశాలు నిర్వహించడం జరిగి సూచనలు అందించామాని తెలిపారు. గతంలో ఉన్న 2041 మాస్టర్ ప్లాన్ ను 2050 నాటి జనాభాను దృష్టిలో ఉంచుకొని పట్టణాన్ని అభివృద్ధి పనులు చేపట్టుటకు ప్రతి పాదించాలని సూచించారు. ఇందుకు అవసరమైన భూముల సేకరణ చేపట్టాలని అన్నారు. ఇప్పటికే కన్సల్టెంట్లు తయారు చేసిన మాస్టర్ ప్లాన్ లను మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పరిశీలించి, పలు సూచనలు అందించారు. ఈ సమావేశంలో మున్సిపల్ పరిపాలన ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, అశ్విని కమీషనర్ కుడా వైస్ చైర్మన్, గౌతమ్ సిడీఏంఏ, హరిచందన రోడ్లు భవనాలు శాఖ కార్యదర్శి, అజిత్ రెడ్డి కుడా సీపీఓ, కాన్సల్టెంట్లు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు అక్షయపాత్ర ఫౌండేషన్

ఓరుగల్లు నుండి ఇద్దరు మంత్రులు ప్రమాణస్వీకారం

Jaibharath News

టీఎన్జీఓస్ రాష్ట్ర నూతన అధ్యక్షుడు మారం జగదీశ్వర్ కు అభినందనలు