జై భారత్ వాయిస్ న్యూస్ కాకినాడ
బాల్యంలో అలవర్చే కళలు సంస్కృతి అభ్యాసం వలన భావి జీవితాలు సుసంపన్నం అవుతాయని భోగి గణపతి పీఠం పేర్కొంది.విద్యాంజలి స్కూల్ లో 3వ తరగతి చదువుతున్న దేవరపల్లి మాధుర్య సాయి ఇస్కాన్ కృష్ణాష్టమి పోటీల సందర్భంగా శిక్షణ పొంది అభ్యాసం చేసి తొలుతగా గణపతి పీఠంలో రాజరాజేశ్వరి నృత్యరూపకం నిర్వ హించింది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుం దన్న రీతిగా మాధుర్య సాయి బాల్యంనుండి ఆగస్ట్ రిపబ్లిక్ డే గోకులాష్టమి దసరా సందర్భాల్లో సాంస్కృతిక దేశ దైవభక్తిభావ యుక్తంగా భారతమాతగా మదర్ థెరిస్సాగా ఝన్సీ లక్ష్మీ భాయిగా బాలకృష్ణునిగా అనేక ఏకపాత్రలో అభినయం చేయడం ద్వారా కళాల ఆసక్తి పొందింది. పలు సంస్థల నుండి ప్రశంసలు జ్ఞాపికలు పొందింది. భవిష్యత్తులో జిల్లా రిపబ్లిక్ డే ఉత్సవాల్లో భారతమాతగా శకట యాత్ర చేయాలని ఆశిస్తోంది. గణపతి పీఠం ద్వారా 2025 జనవరి 26 రిపబ్లిక్ డే ఉత్సవాల్లో భారత మాత శకటం ఏర్పాటు పై పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ కార్యక్రమాల్లో కలెక్టర్ అధ్యక్షతన జరిగే సాంస్కృతిక కార్యక్ర మాల్లో తగిన అనుమ తులు కోరతామని పీఠం ఉపాసకులు దూసర్ల పూడి రమణరాజు తెలిపారు. చిన్నారిని ఆశీర్వదించారు. కళల పట్ల ఆసక్తితో ప్రోత్సహి స్తున్న తల్లిదండ్రులను ప్రశంసించారు.
previous post