జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 25 హనుమకొండ ప్రతినిధి:-జనగామ జిల్లా చిల్పూరు మండలంలోని శ్రీపతిపల్లి గ్రామంలో శ్రీ విష్ణు దుర్గామాత దేవాలయంలో అమ్మవారికి బంగారు ఆభరణాలు సమర్పించి ప్రత్యేక మోక్కులు చెల్లించిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు. ఈ సందర్భంగా కొండా మురళీధర్ రావు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో సకల సంపదలతో సుభిక్షంగా వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించారు. ప్రజలు ఆకాంక్షించిన తెలంగాణ సహకారం దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముందుకు సాగేలా శక్తి యుక్తులు ప్రసాదించాలని ప్రార్థించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా పోతురాజుల విన్యాసాలను మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు ఆసక్తిగా తిలకించారు.
