జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 25 హనుమకొండ ప్రతినిధి:-ఆత్మకూరు మండలం నాగయ్య పల్లి గ్రామానికీ చెందినా బిఆర్ఎస్ పార్టీ మాజీ ఉపసర్పంచ్ పోగుల సుగుణాకర్, మాజీ డైరెక్టర్ నేరెళ్ల రవీందర్ ఆదివారం పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు అకర్షితులై పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో బోయిని సాంబరాజు చింతగుల విజయ్ కుమార్, కృష్ణారెడ్డి మహిపాల్ రవీందర్ మహేందర్ రెడ్డి దాదాపు 20 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.