Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరస్కరించిన రైతులను ప్రజలను పక్కదారి పట్టించి రాజకీయం చేస్తున్నరు

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 25 హనుమకొండ ప్రతినిధి:-బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరస్కరించిన తర్వాత కూడా, అనైతిక రాజకీయాలతో రైతులను తప్పుదారి పట్టించి, మోసం చేస్తూ, రాజకీయా లబ్ది పొందాలని చూస్తున్నారని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఆదివారం పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పత్రికా, మీడియా మిత్రుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ..
రైతు రుణమాఫీ విషయంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ధర్నాలలో బిఆర్ఎస్ కార్యకర్తలు తప్ప అసలైన రైతులు ఎవరు కనబడడం లేదన్నారు. మరికొద్ది రోజుల్లో బిఆర్ఎస్ పార్టీకి ఉన్న ప్రతిపక్ష హోదా కోల్పోవడం ఖాయమని, దీన్ని ప్రజలు గమనిస్తున్నారు అని అన్నారు. ఖమ్మంలో రైతులకు బేడీలు వేచించిన చరిత్ర బిఆర్ఎస్ పార్టీది, బిఆర్ఎస్ నేతలకు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. మార్కెట్ ఇంటెన్సీ ఫండ్ ఇప్పిస్తానని, రైతులకు బోనస్ చెల్లిస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పాపనా పోలేదు అని, ఇది బిఆర్ఎస్ నాయకుల మోసపూరిత తప్పుడు వాగ్దనాలు అని అన్నారు.ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల లోపు ఉన్న రుణమాఫీని అమలు చేసి తీరామనిఅన్నారు. రైతులకు రుణమాఫీ విషయంలో ఏమైనా సందేహాలు ఉంటే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించా లన్నారు. సాంకేతిక కారణాలతో రుణమాఫీ కానీ రైతుల వివరములు సరిచేసి వారికి రావలసిన రుణాలను మాఫీ చేయించుటకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగినది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అర్హత ఉన్న ప్రతి రైతుకి రుణమాఫీ చేస్తామని, వీలైనంత త్వరలో అర్హత మేరకు రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. కాలేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ లోపంతో, నాణ్యత లోపంతో నిర్మించడం వలననేడు ఉపయోగం లేకుండ పోయింది అని నాగేశ్వరరావు ఇ ఎన్ సి చెప్పిన రిపోర్ట్ నిదర్శనం అన్నారు. కెసిఆర్ హరీష్ రావు వారి ఆదేశాల మేరకు వారి సొంత ప్రయోజనాల కోసం కాలేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేశారన్నారు. కెసిఆర్ స్వయం పాలనాపేరుతో 10 సంవత్సరాల కుటుంబ పాలన చేశారని,ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి తను అనునాయులకు దూచిపెట్టారు అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఇబ్బందికరమైన క్లిష్ట పరిస్థితులలో కూడా ఆర్థిక క్రమశిక్షణ ద్వారా వెసులు బాటులను పెంపొందించు కుంటుంది అన్నారు.

Related posts

చల్లా ధర్మారెడ్డి వెంటే హౌజ్ బుజుర్గ్ గ్రామస్థుల

Jaibharath News

బాల్యం నుంచే క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలి

Jaibharath News

కుడా చేపట్టిన పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులను పరిశీలించిన ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి

Sambasivarao