జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ ప్రతినిధి:- ఆగష్టు 26
ఆగస్టు 14 న అమెరికాలో మృతి చెందిన ఏరుకొండ రాజేష్ మృతదేహాన్ని వారి స్వగ్రామం ఆత్మకూరుకు తీసుకొని రాగా ఈరోజు వారి నివాసానికి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రాం రెడ్డి వెళ్లి పార్థీవ దేహాన్ని సందర్శించి పులమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.. అనంతరం ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రాం రెడ్డి మాట్లాడుతూ.రాజేష్ మృతివార్త తెలియగానే ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకవచ్చేందుకు తాను జిల్లా కలెక్టర్, ముఖ్యమంత్రి కార్యాలయంతో ఫోన్లో మాట్లాడడం జరిగినదని, వారు స్పందించి మృతదేహాన్ని స్వగ్రామానికి వచ్చేలా కృషి చేసిన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఉన్నత చదువులు, మంచి ఉద్యోగం కోసం అమెరికాకు వెళ్లిన రాజేష్ విగత జీవిగా తిరిగి రావడం బాధాకరమని వారి కుటుంబానికి తీరని లోటని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వారి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటుందని అన్నారు.
previous post