జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ ఆగష్టు 26
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విద్యార్థుల హామీలను వెంటనే అమలు చేయాలని అన్ని హామీలను అమలు చేస్తున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులకు ఇచ్చిన హామీలను కూడా వెంటనే అమలు చేయాలని రాష్ట్రంలో విద్యా రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి వీసీల నియామకల జాప్యం లేకుండా వెంటనే నియమించి, పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ డిమాండ్ చేశారు. హన్మకొండ హరిత కాకతీయలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి రాష్ట్రఅధ్యక్ష, కార్యదర్శి మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శి మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగం సమస్యలతో సతమతమవుతుందని, గురుకుల విద్యార్థుల మరణాలు బాధాకరమని గురుకులాల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు వారికి ఉన్న సమస్యలు పరిష్కరించి కల్పించి విద్యార్థులకు ప్రభుత్వం అన్నివిధాల అండగా ఉండాలని గురుకులాల్లో జరిగిన మరణాలపై విచారణ జరిపించాలని, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తున్నామని చెపుతున్న సిఎం రేవంత్ రెడ్డి మీ వద్దే విద్యాశాఖ ఉందికదా మరి ఎందుకు విద్యారంగానికి ఇచ్చిన హామీల అమలుకు కృషి చేయటం లేదని మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ ప్రశ్నించారు. విద్యార్థులకు ల్యాప్ టాప్ లు, ఎలక్ట్రిక్ స్కూటీలు, అయిదు లక్షల విద్యార్థి భరోసా కార్డులు మండలానికో ఇంటర్నేషనల్ పాఠశాల ఏర్పాటు హామీలను వెంటనే అమలు చేయాలని మే 21న యూనివర్సిటీల వీసీల పదవి కాలం ముగిసిందని 15 రోజుల్లో పూర్తి స్థాయి వీసీలను నియమిస్తామని చెప్పిన సిఎం రేవంత్ రెడ్డి ఇప్పటికీ వీసీల నియామకం చేపట్టాక పోవడం సరికాదని ఇంచార్జ్ వీసీలవల్ల యూనివర్సిటీలల్లో విద్య ప్రమాణాలు తగ్గుతున్నాయని వెంటనే సెర్చ్ కమిటీ సమావేశాలు నిర్వహించి యూనివర్సిటీలకు పూర్తి విసిలను నియమించాలని కాకతీయ యూనివర్సిటీ అభివృద్ధికి 500 కోట్లు కేటాయించాలని పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయకుండా బిఆర్ఎస్ పూర్తి నిర్లక్ష్యం చేయడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడ్డారని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఫీజు బకాయిలు మొత్తం విడుదల చేస్తామని చెప్పి ఇప్పుడు పాతవి, కొత్తవి అనడం సరికాదని వెంటనే ఫీజు బకాయిలు మొత్తం విడుదల చేసి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలని రాష్ట్రంలోని సంక్షేమ హాస్టలల్లో మౌలిక వసతులు కల్పించి అద్దె భవనాల్లో కొనసాగుతున్న హాస్టళ్లకు కొత్త భవనాలు నిర్మించి పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి ప్రణీత్ కార్యదర్శి భాషబోయిన సంతోష్, జిల్లా ఆఫీస్ బేరర్స్ రవి తేజ, జిల్లా సమితి సభ్యులు పసుల వినయ్. పాల్గొన్నారు.
