జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ ప్రతినిధి:- ఆగష్టు 26
గ్రేటర్ వరంగల్ నగరంలోని కాజీపేట 63 వ డివిజన్ అంబేద్కర్ నగర్ కాలనిలో పోచమ్మతల్లి బోనాల ఉత్సవాలలో భాగంగా పలు యూత్ సభ్యుల ఆధ్వర్యంలో వారు ఘనంగా ఏర్పాటు చేసిన తొట్టెబండి ఊరేగింపు,ఫలహారంబండి, పోతురాజుల రథయాత్రలలో ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాలను ప్రారంభోత్సవం చేసిన తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, ఈ సందర్భంగా జంగా రాఘవరెడ్డి అమ్మవారికి మొక్కులు సమర్పిస్తూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు అదేవిధంగా వరంగల్ జిల్లాలోని ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సకాలంలో వర్షాలు పడి రైతులకు పంటలు బాగా పండి వారు అభివృద్ధి చెందాలని అదేవిధంగా కార్మిక కర్షకులకు కూలీలకు అందరికీ కూడా చేతునిండా పనులు దొరకాలని కోరుకున్నారు.