Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

కట్ట మల్లన్న దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ ప్రతినిధి:- ఆగష్టు 26
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలోని 15 వ డివిజన్ గొర్రకుంట శివారులోని కట్ట మల్లన్న దేవాలయాన్ని సోమవారం పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి సందర్శించారు. కట్ట మల్లన్న దేవాలయం పురాతన కట్టడాలను నిర్మాణ పనులను పరిశీలించారు దేవాలయ అభివృద్ధిపై దేవాలయ అధికారులు పూజారులు, భక్తులు, ప్రజలతో దేవాలయంలో చర్చించారు.మొదటిసారిగా దేవాలయానికి వచ్చిన ఎమ్మెల్యేకి పూజారులు స్వాగతం పలికి వేదమంత్రోత్సవ మధ్య పూజలు నిర్వహించి ఆశీర్వచనం చేసి పుష్ప గుచ్చం అందించి అందించి ఎమ్మెల్యేని శాలువాతో సత్కరించారు అనంతరం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి దేవాలయ ఆవరణలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి పకాశ్ రెడ్డి మాట్లాడుతూ.కాకతీయుల నాటి దేవాలయాలను కాపాడు కోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కట్ట మల్లన్న దేవాలయంలో భక్తుల అవసరాలకు తగ్గట్టుగా భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి పనులు చేపట్టాల్సి వుందని అన్నారు.దేవాలయ ప్రాచుర్యాన్ని పవిత్రతను కాపాడుతూ దేవాలయానికి వచ్చే భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ఈ ప్రాంత ప్రజలు సహకారం అవసరమని అన్నారు. దేవాలయ భూములను రక్షిస్తూ అభివృద్ధి ప్రణాళికతో అవసరమైన పనులను తన దృష్టికి తీసుకొని వస్తే ప్రభుత్వ పెద్దల సహకారంతో దేవాలయ అభివృద్ధికి తాను కృషి చేస్తానని అన్నారు.

Related posts

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుక బీసీ బిడ్డ తీన్మార్ మల్లన్నను గెలిపించండి

పర్వతగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా రాజగోపాల్

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వరంగల్ జిల్లా పరిషత్ సిఈఓ రాoరెడ్డి.

Sambasivarao