జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ ప్రతినిధి:- ఆగష్టు 26
హనుమకొండ 61వ డివిజన్ ఫాతిమా నగర్ (నాన్య తండా) లో నిర్వహించిన శ్రీకృష్ణష్టమి వేడుకల్లో ముఖ్యఅతిథిగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి. భగవాన్ శ్రీ కృష్ణ పరమాత్ముడికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం వేడుకల్లో మొదటి ఉట్టికొట్టి వేడుకలను ప్రారంభించారుఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీకృష్ణ జన్మాష్టమి అనగానే ప్రతి ఇంట్లో గోపికమ్మలు, చిన్ని కృష్ణులువేశాధారణతో తల్లితండ్రులు ఎంతో సంబరపడుతారని అన్నారు. హిందూ సంస్కృతి సాంప్రదాయాలను పాటించాలని గుర్తు చేశారు. భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పిన ప్రతి అంశాన్ని ఆచరణలో నడుపుతూ, రాబోయే తరానికి స్ఫూర్తిదాయకంగా ఉండాలని కోరారు. శ్రీకృష్ణుడి చల్లని చూపు ప్రజలందరికీ ఉండాలని, రాష్ట్ర ప్రజలందరికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు యువకులు యువకులు పాల్గొన్నారు.