జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 26 వర్ధన్నపేట ప్రతినిధి:-
ఎస్ బి ఐ బ్యాంకులో కంప్యూటర్స్ షాట్ సర్క్యూట్
రెండు కంప్యూటర్లు వివిధ రకాల డాక్యుమెంట్స్ మరియు కొంత వరకు ఫర్నిచర్ దగ్నం.
తొర్రూర్ లో ఫైర్ స్టేషన్ లేకపోవడంతో ఇబ్బంది పడుతున్న ప్రజలు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్ బి ఐ) బ్యాంక్ లో కంప్యూటర్లలో షార్ట్ సర్క్యూట్ వలన స్వల్ప మంటలు చెలరేగి బ్యాంక్ మొత్తం పొగతో కమ్ముక పోయిన సంఘటన. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది. బ్యాంక్ సిబ్బంది తెలిపిన కథనం ప్రకారం. ఆదివారం బ్యాంక్ కు సెలవు బ్యాంక్ సిబ్బంది, బ్యాంక్ కు కావలసిన పనులు చేస్తుండగాపైన ప్రస్తుతం బ్యాంక్ లో ఒక్క కంప్యూటర్ లో చిన్నగా పొగ రావడం మొదలై, దానితో మరో కంప్యూటర్ లో మంటల చెలరేగాయి. దీంతో బ్యాంక్ నుండి భారీగా పొగ రావడంతో…అప్రమత్తమైన బ్యాంక్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వగా వెంటనే పోలీసులు వచ్చి స్థానికుల సహాయంతో మంటలు అర్పేశారు. సమాచారం అందుకున్న వర్ధన్నపేట అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని పలు సూచనలను చేశారు. ఈ మంటలలో కొన్ని ఫైల్స్, కంప్లెట్స్ బాక్స్, రెండు కంప్యూటర్లు, మరియు కొంత మేరకు ఫర్నిచర్ దగ్నమైందని బ్యాంకు సిబ్బంది తెలిపారు.
తొర్రూర్ డివిజన్ కేంద్రంలో ఫైర్ స్టేషన్ లేకపోవడం బాధాకరం
మహబూబాబాద్ జిల్లాలోని అతిపెద్ద డివిజన్ అయినా తొర్రూర్ పట్టణంలో ఇంతవరకు ఫైర్ స్టేషన్ లేకపోవడం గమనార్ధం. ఇలాంటి ప్రమాదాలు మరల పునరావృతం జరగకుండా ఉండాలని ఇలాంటి ప్రమాదాలకు అందుబాటులో తొర్రూర్ పట్టణంలోని ఒక ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరారు.