Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

గంజాయి స్మగ్లర్ పై పీడీయాక్ట్

జై భారత్ వాయిస్ న్యూస్ దామెర ఆగస్టు 26
గంజాయి స్మగ్లర్ పై వరంగల్ పోలీస్ కమిషనర్ సోమవారం పీడీయాక్ట్ ఉత్తర్వులు జారీ చేసారు. ఆంధ్ర ప్రదేశ్ నుండి వరంగల్ మీదుగా మహరాష్ట్రకు గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న భూపాలపల్లి జిల్లా గోరుకొత్తపల్లి ప్రాంతానికి చెందిన గజ్జి సహాదేవ్ రాజ్ పై వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా జారీచేసిన పీడీయాక్ట్ ఉత్తర్వులను శాయం పేట్ సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ రంజిత్ రావు, దామెర ఎస్. ఐ అశోక్ నిందితుడికి పరకాల సబ్ జైల్లో అందజేసి చర్లపల్లి జైలుకు తరలించారు. పీడీ యాక్ట్ ఉత్తర్వులను అందుకున్న నిందితుడు గత జూన్ నెల 8వ తేదీన మరో ఇద్దరు నిందితులతో కలసి అంధ్రప్రదేశ్ నుండి మహరాష్ట్రకు గంజాయి అక్రమ రవాణాకు చేస్తుండగా టాస్క్ ఫోర్స్ మరియు దామెర పోలీసులు సంయుక్తంగా కల్సి ఈ ముఠాను అరెస్టు చేసారు. ఈ ముఠా నుండి పోలీసులు యాభై లక్షల విలువగల 192 కిలోల గంజాయితో పాటు ఒక కారు , మూడు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకోని జైలుకు తరలించారు.సులభంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో దేశ అభివృద్ది కీలకమైన యువతను మత్తు పదార్థాలకు బానిసలుగా మార్చేందుకుగాను మత్తుపదార్థాల అక్రమరవాణాకు పాల్పడితే సహించేది లేదని అలాగే చట్ట వ్యతిరేక కార్యాలపాలకు పాల్పడితే పీడీ యాక్ట్ క్రింది కేసులు నమోదు చేయబడుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.

Related posts

క్యాన్సర్ పేషంట్ల కోసం కేంద్ర ప్రభుత్వ పథకం

రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి*

Jaibharath News

భద్రకాళి సమేత శ్రీ కొత్తకొండ వీరభద్ర స్వామి వారి 27 రోజుల నక్షత్ర దీక్ష మాల విరమణ మంత్రి పొన్నం ప్రభాకర్

Sambasivarao