*నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్* వరంగల్//కాశిబుగ్గజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 26 వరంగల్ ప్రతినిధి:-
కాశిబుగ్గకు చెందిన కదిరాల కిరణ్ ఆటో డ్రైవర్ తన ఆటోలో కాశిబుగ్గ శివాలయం దగ్గర ఒక మహిళ ఆమె కుటుంబ సభ్యులతో తన ఆటోలో ఎక్కి హనుమకొండ పెట్రోల్ బంక్ దగ్గర దిగినట్టు తెలిపినాడు దిగే సమయంలో ఆ మహిళ ఆటోలో తన బ్యాగు మరిచిపోయింది గమనించిన ఆటో డ్రైవర్ కిరణ్ వెంటనే ఇంతే జార్గంజ్ పోలీసులకు తీసుకొచ్చి అప్పజెప్పినాడు బ్యాగులో చూస్తే ఆ మహిళలకు సంబంధించి సుమారు మూడు తులాల బంగారు ఆభరణాలు మూడు జతల చెవి కమ్మలు మరియు 17,500 డబ్బులు కలవు మహిళ ఇంతవరకు పోలీస్ స్టేషన్ కి రాలేదు వారిని గుర్తించి వారి వస్తువులు వారికి అప్పగిస్తామని చెప్పి సందర్భంగా సిఐ తెలిపినారు సందర్భంగా తన నిజాయితీని చాటుకున్న ఆటో డ్రైవర్ కిరణ్ ని పోలీసులు ఎస్సై లు వెంకన్న, రాజులు మెచ్చుకున్నారు అభినందించారు.