Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ఇంటర్నేషనల్ కరాటే  విద్యార్థులను అభినందించిన ఎంపీ కడియం కావ్య.

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 26 హన్మకొండ ప్రతినిధి:-విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో రాణించాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు. కర్ణాటక రాష్ట్రం శివ మొగ్గలో  ఈ నెల 24, 25 తేదీలలో జరిగిన ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలలో హనుమకొండ జిల్లాకు చెందిన బీఎంఆర్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు ఆరు బంగారు పథకాలు మూడు సిల్వర్ పథకాలు గెలిచి జిల్లా సత్తా చాటారు. కాగా వారంతా సోమవారం హనుమకొండ కనకదుర్గ కాలనీలోని ఎంపీని, వారి నివాసంలో క‌లిశారు. కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులను ఎంపీ డాక్టర్ కడియం కావ్య అభినందించి, సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీ డా.కడియం కావ్య మాట్లాడుతూ కరాటే ఆత్మరక్షణ కోసమేకాకుండా, శారీరక, మానసిక దృఢత్వాన్ని ఇస్తుందన్నారు. కరాటేతో ఏకాగ్రత, ఆత్మ విశ్వాసం పెరిగి చదువులో సైతం రాణించే అవకాశం ఉందని, ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అఘాత్యాలను దృష్టిలో ఉంచుకొని అమ్మాయిలు తప్పకుండ కరాటే నేర్చుకోవాలన్నారు.

Related posts

దామెరలో వృద్దులకు ఉచిత సంచార వాహన వైద్య సేవలు

Jaibharath News

ఆత్మకూరు లో పోలింగ్ కేంద్రాల పరిశీలన

Jaibharath News

హైదరాబాద్ కు దీటుగా వరంగల్ ను అత్యుత్తమంగా అభివృద్ధి చేస్తాం..ఇందుకోసం నేను నిద్ర పోను..