April 11, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

పంచలింగాల శివాలయం నిర్మాణానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తా-పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి .

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):
భారత దేశంలోనే అరుదైన పంచలింగాల శివాలయం పునర్నిర్మానం కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని చేసుకోవడం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. సోమవారం ఆత్మకూరు మండల కేంద్రంలో వెయ్యి సంవత్సరాల పూర్వం నిర్మాణం చేసిన శివాలయం శిథికావస్థకు చేరుకోవడంతో దాతలు భక్తులు ముందుకు వచ్చి పునర్నిర్మాణం పనులు పూర్తి కావస్తున్నదని చెప్పారు. పంచలింగాల శివాలయాన్ని ఎమ్మెల్యే దేవాలయాన్ని పరిశీలించి ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులను ఆలయంలో ప్రతిష్టించే నూతన విగ్రహాలతో పాటు ధ్వజస్తంభం ఏర్పాటు గూర్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆలయ నిర్మాణ పన్నుల్లో నాణ్యత ప్రమాణాలను పాటించాలని అలాగే వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఆలయ నిర్మాణం కోసం అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఆత్మకూరు మండల ప్రజలు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి అరుదైన పంచలింగాల శివాలయం పునర్నిర్మాణం జరగదు అన్నారు. వేద పండితులతో నిత్యం విశేష పూజలు నిర్వహించాలని అప్పుడే ప్రజలందరికీ శివపార్వతుల అనుగ్రహం కలుగుతుందన్నారు. ఇక్కడ పూజలు చేసే భక్తులకు వారి కోరిన కోరికలు తీరుతాయని అందుకు నిదర్శనమే పునర్నిర్మాణమన్నారు. ఎమ్మెల్యే తో పాటు ఆలయ కమిటీ చైర్మన్ వంగాల బుచ్చిరెడ్డి, మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పరికిరాల వాసు, జిల్లా కాంగ్రెస్ నాయకులు రేవూరి జలంధర్ రెడ్డి, రేవూరి దేవేందర్ రెడ్డి, ఆలయ కమిటీ బృందం సిరిపురం సంపత్, బూర కిషోర్, బాదం వెంకటేశ్వర్లు, ఆల్వాల రవి, తదితరులు ఉన్నారు.

Related posts

హుస్నాబాద్ కాంగ్రెస్ టికెట్ అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి కేటాయించాలి

Jaibharath News

సర్వే వివరాలను అత్యంత జాగ్రత్తగా నమోదు చేయాలి

అంతర్జాతీయ సదస్సుకు ఆర్ట్స్ కళాశాల అధ్యాపకులు!