జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 27 హనుమకొండ ప్రతినిధి:-
వర్షాకాలంలో ప్రధాకరమైన దోమల విహారంతో ప్రభలుతున్న విషజ్వరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వైద్య సిబ్బంది వార్డులలో పర్యటిస్తూ జ్వర పరీక్షలు చేయాలనీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు మంగళవారం రోజున 52 వ డివిజన్లోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. వైద్య శిబిరంలో జరుగుతున్న పరీక్షలను నిశితంగా పరిశీలించారు. ఉచిత వైద్య శిభిరాలను నియోజకవర్గ పరిధిలో అన్ని వార్డుల్లో నిర్వహించేల చూడాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ఆదేశించారు. ఉచిత శిబిరాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకునేలా ముందస్తు ప్రణాళికను విడుదల చేయాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే అలిపుర బడి మసీద్ కాలనీలో అధికారులతో కలిసి పర్యవేక్షించారు వార్డులో ఉన్నటువంటి సమస్యలను నేరుగా ప్రజల్ని అడిగి తెలుసుకుంటూ సాగారు. ప్రధాన సమస్యగా ఉన్న డ్రైనేజ్ అంతర్గత రోడ్ల నిర్మాణాలు, పేరుకుపోయిన చెత్త చెదారం పట్ల ఆసహనం వ్యక్తం చేశారు. మున్సిపల్ సిబ్బంది ఎప్పటి కప్పుడు వార్డులలో పర్యటించాలని చెత్తాచెదారం పట్ల ఉపేక్షించేది లేదన్నారు. వార్డు పర్యాటంలో ఇల్లు లేవని కోరిన మహిళలకు త్వరలో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.యుద్ధ ప్రాతిపదికన సైడ్ డ్రైన్ నిర్మాణం మరియు కమ్యూనిటీ హాల్ మిగిలిన పనుల కోసం అంచనాలు వేసినా తీసుకోవస్తే తక్షణమే నిధులు మంజూరి ఇస్తానని తెలిపారు. ఇప్పటికే తెలంగాణ ప్రజాప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలులో జరుగుతున్న అక్కడక్కడా వస్తున్న అభ్యర్థనలను అధికారులు మరియు స్థానిక నాయకులు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కమ్యూనిటీ హల్ నిర్మాణం త్వరగతిన పూర్తి చేసి, కాలనీ మహిళలకు అందుబాటులోకి ఉంచుతామాని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కాలనీవాసులు అధికారులు పాల్గొన్నారు.
