జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 27 హనుమకొండ ప్రతినిధి:-
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ (సి డి ఏమ్ ఏ) వీపీ గౌతమ్ కుడాకి చెందిన పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, వైస్ చైర్మన్ అశ్విని తానాజీ వాకడే, సిపివో అజిత్ రెడ్డి సంబంధిత అధికారులతో కలిసి ఉనికిచెర్ల గ్రామంలోని యునీ సిటీ, దేవన్నపేటలోని మా సిటీ, వరంగల్ లోని ఓ సిటీ ఇన్నర్ రింగ్ రోడ్ (ఐఆర్ఆర్) రోడ్డు పనులను బాలసముద్రంలోని కాళోజి కళాక్షేత్ర పనులను పరిశీలించారు. అనంతరం హనుమకొండ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డితో కలిసి నయీంనగర్ లోని నాలాపై నిర్మిస్తున్న వంతెన పనులను పరిశీలించారు. అనంతరం కుడా కార్యాలయానికి విచ్చేసిన వీపీ గౌతమ్ కి కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి శాలువాతో సత్కరించి ఆహ్వానించారు.