Jaibharathvoice.com | Telugu News App In Telangana
జాతీయ వార్తలు

ఎమ్మెల్సీ కవితపై ఈడీ కేసు అక్రమం

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 27 వరంగల్ ప్రతినిధి:-
ఎమ్మెల్సీ కవితపై ఎడి కేసు అక్రమం సర్వోత్తమ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడం హర్షనియమని బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ రవిచంద్ర. అన్నారు.ఢిల్లీ లిక్కర్ పాలసీతో ఏ మాత్రం సంబంధం లేకున్నా తమ పార్టీ ఎమ్మేల్సీ, కల్వకుంట్ల కవితపై ఈడీ అక్రమంగా కేసు బనాయించి 168 రోజులు అన్యాయంగా జైల్లో వేయించడం తీవ్ర బాధాకరమని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు. లిక్కర్ పాలసీతో ఆమెకు ఎటువంటి ప్రమేయం లేదని, ఇందుకు సంబంధించి ఆమె వద్ద నుంచి ఎలాంటి పత్రాలు, ఆధారాలు లభించలేదని, కేసులో దమ్ము లేదని అన్యాయంగా, అక్రమంగా బనాయించారని తాము మొదటి నుంచి కూడా చెబుతున్న విషయాన్ని ఎంపీ రవిచంద్ర ప్రస్తావించారు.కవితకు బెయిల్ మంజూరైన సందర్భంగా మంగళవారం ఎంపీ వద్దిరాజు సుప్రీంకోర్టు వద్ద మీడియాతో మాట్లాడారు. సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో బెయిల్ మంజూరు చేసి ఊరట కల్పించడం సంతోషకర మన్నారు. ప్రజాప్రతినిధిగా ఉన్న కవితను ఇతర సామాన్య ఖైదీల మాదిరిగా చూడడం పట్ల న్యాయస్థానం కూడా తప్పుబట్టిందన్నారు. ఈ కేసులో కవిత కడిగిన ముత్యం మాదిరిగా బయటకు వస్తారని ఆయన స్పష్టం చేశారు. కవితకు బెయిల్ మంజూరు కావడం పట్ల తెలంగాణ ప్రజలు, మహిళామణులు, పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇందుకు మొదటి సహకరించిన న్యాయవాదులు, ప్రెస్ అండ్ మీడియా, పార్టీ ప్రముఖులకు ఎంపీ వద్దిరాజు ధన్యవాదాలు తెలిపారు.

Related posts

కార్తీక మాసము ముప్పది రోజులు /నెలలొ పాటించవలసిన నియమాలు .

Elderly should be given due respect and importance వృద్ధులకు తగిన గౌరవం, ప్రాముఖ్యతను ఇవ్వాలి

Jaibharath News

నోటుకి ఓటు అమ్ముకుంటే ఐదేళ్ల భవిష్యత్తు అధోగతే!*