May 9, 2025
Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

విధులకు హాజరు కాని హాస్టల్ వార్డెనులను సస్పెండ్ చేయాలి ఎస్ఎఫ్ఐ మంద శ్రీకాంత్

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 27 హన్మకొండ ప్రతినిధి:-హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ వార్డెన్లు రెగ్యులర్గా విధులకు హాజరు కాని వారిని వెంటనే సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు స్టాలిన్ మంద శ్రీకాంత్ అన్నారు. నగరంలోని రామ్ నగర్ లో ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంద శ్రీకాంత్ మాట్లాడుతూ హనుమకొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ వార్డెన్లు విధులకు రెగ్యులర్గా హాజరు కావడం లేదన్నారు పొద్దున వచ్చి 30 నిమిషాలు 20 నిమిషాలు ఉండి మళ్లీ వెంటనే ఇంటికి వెళ్తున్నారన్నారు విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు జిల్లాలోని కొన్ని హాస్టల్లో మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదన్నారు విద్యార్థులు కొత్త అడ్మిషన్ల కోసం హాస్టల్ కు వస్తే వార్డెన్స్ అందుబాటులో లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు అన్నారు సాయంత్రం వేళ కూడా సరిగా వార్డెన్సు విధులకు హాజరు కావడం లేదన్నారు ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వివిధ హాస్టల్స్ ను సర్వే చేసినప్పుడు ఎవరు కూడా అందుబాటులో లేరన్నారు హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలను వార్డెన్లకు చెప్పుదామంటే కూడా వారు స్పందించకుండా రెగ్యులరుగా హాస్టలుకి రావడం లేదన్నారు ఈ విషయంపై గతంలో జిల్లా కలెక్టరుకి వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు అయినా కూడా వార్డెన్ల తీరు మార్చుకో లేదన్నారు ఈ విషయంపై తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ ను సందర్శించి విధులకు హాజరు గాని వార్డెన్లను తక్షణమే సస్పెండ్ చేయాలన్నారు లేదంటే ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని సందర్భంగా వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి బి రెడ్డి జశ్వంత్ పురుషోత్తం సాయికుమార్ సాయి సందీప్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

హుస్నాబాద్ కాంగ్రెస్ టికెట్ అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి కేటాయించాలి

Jaibharath News

కొత్తూరు జెండాలో 40 లక్షలతో అంతర్గత రోడ్ల నిర్మాణం

ఇంటింటి జ్వరం సర్వే అందరూ సద్వినియోగం చేసుకోవాలి

Notifications preferences