జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 27 కేయూ ప్రతినిధి:-
తెలంగాణ రాష్ట్ర లా ఎంట్రన్స్ సెట్ వెబ్ ఆప్షన్లు నేడు మొదలవుతుండగా అందులో కాకతీయ యూనివర్సిటీ న్యాయకాలశాల లేకపోవడం విద్యార్థులను ఆగ్రహవేషాలకు గురిచేసింది వెంటనే ఈ విషయంపై ఎస్.ఎఫ్.ఐ, పి.డి.ఎస్.యు కమిటీల ఆధ్వర్యంలో రిజిస్టర్ ఆచార్య మల్లారెడ్డికి వినతి పత్రం అందించి సమస్యపై వివరించడం జరిగింది. అనంతరం ఎస్ఎఫ్ఐ హన్మకొండ జిల్లా అధ్యక్షులు స్టాలిన్, పి.డి.ఎస్.యు హన్మకొండ నగర అధ్యక్షులు రంజిత్ మాట్లడుతూ యునివర్సిటీ అధికారుల నుండి నిర్లక్ష్యపు సమాధానాన్ని విద్యార్థులు ఎదుర్కొన్నారని అటు కళాశాల ప్రిన్సిపల్ యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే పది రోజుల ముందుగా కళాశాల అఫియేషన్ ఫీజు కట్టకపోవడంతో అడ్మిషన్లు రద్దు అవుతాయని మేము హెచ్చరించినప్పటికీ నేడు అడ్మిషన్లు రద్దయాని ఆరోపించారు యూనివర్సిటీ నాయకళాశాలలో కనీస విద్యా వసతులైన హాస్టల్, మూట్ కోర్ట్ హాల్, సెమినార్ హాల్ సరిపోను రెగ్యులర్ అధ్యాపకులు లేకపోవడం యూనివర్సిటీ అధికారుల ప్రభుత్వా నిర్లక్ష్యమేనా అని ఆరోపించారు న్యాయక లక్షల అడ్మిషన్ల రద్దుకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని వెంటనే యూనివర్సిటీ న్యాయ కళాశాల గుర్తింపు రద్దుకు బాధ్యత వహిస్తూ యూనివర్సిటీ రిజిస్టర్ కళాశాల డీన్ ప్రిన్సిపల్ బి ఓ ఎస్ లు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం విద్యా శాఖ మంత్రిని, యూనివర్సిటీలకు వెంటనే రెగ్యులర్ వీసీలను నియమించాలని ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో న్యాయ కళాశాల విద్యార్థులు అరుణ్ రాకేష్ ఉదయ్ వంశీ దిలీప్ పాల్గొన్నారు.
