జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 28 పరకాల ప్రతినిధి:-
పరకాల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఖాళీ ప్లేట్ల తో నిరసన వ్యక్తం చేశారు అనంతరం ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం వెంటనే అమలు చేయాలన్నారు అదేవిధంగా ఇంటర్మీడియట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలన్నారు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు లేదంటే రాబోయే రోజుల్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శి సాయి తేజ మహేష్ తరుణ్ వినయ్ అజయ్ వర్మ విష్ణుతేజ విద్యార్థులు పాల్గొన్నారు.