A
ఋషి డిగ్రీ కాలేజ్ విద్యార్థుల శ్రమదానం
జై భారత వాయిస్,కుందుర్పి
కుందుర్పి మండల కేంద్రంలో గల అయ్యప్ప స్వామి దేవాలయం సమీపంలో ఉన్న పురాతన దేవాలయాన్ని డిగ్రీ కాలేజ్ విద్యార్థులు శ్రమదానం చేశారు. ప్రిన్సిపాల్ అరుణ మేడం ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్లు మణికంఠ నరేష్ పర్యవేక్షణలో పురాతన దేవాలయం చుట్టూ పరచుకున్న పిచ్చి మొక్కలను తొలగించి చెట్లను కొట్టేసి గుడి ముందు అపరిశుభ్రంగా ఉన్న మండపాన్ని శుభ్రం చేస్తూ విద్యార్థులు తమ సంస్కృతి సాంప్రదాయాలను కబడుకోవడంలో భాగంగా విద్యార్థులు తమ వంతుగా ప్రయత్నం చేస్తున్నారని ప్రిన్సిపాల్ అరుణ మేడం తెలిపారు.