Jaibharathvoice.com | Telugu News App In Telangana
మహబూబాబాద్ జిల్లా

జూనియర్ కాలేజీలలో లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలి ఎస్ఎఫ్ఐ జిల్లా కో- కన్వినర్ గుగూలోతు సూర్య ప్రకాష్

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 28 నర్సంపేట ప్రతినిధి:-
రాష్ట్రంలో జూనియర్ కాలేజీలలో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) జిల్లా కో- కన్వీనర్ గుగులోతు సూర్య ప్రకాష్ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా బుధవారం మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలను సందర్శించి విద్యార్థులతో సభ్యత్వం నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సూర్యప్రకాష్ మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ కోర్సులలో హెచ్ఈసిలో హిస్టరీ లెక్చరర్ల కొరత ఉందని, ప్రభుత్వ కళాశాలలో హిస్టరీ చదువుకునే విద్యార్థులు హిస్టరీ లెక్చరర్లు లేక అవస్థలు పడుతున్నారు అని అన్నారు. దాంతోపాటు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం తక్షణమే అమలు చేయాలని, పెండింగులో ఉన్న 8000 కోట్ల రూపాయల స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కన్వినింగ్ కమిటీ సభ్యులు రాజేష్, మండల నాయకులు సంతోష్, రాకేష్, అఖిల్, వినయ్, నితిన్, విద్యార్థులు పాల్గొన్నారు

Related posts

విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ

Sunder

బిజెపి తొర్రూరు అర్బన్ మరియు రూరల్ శాఖల ఆధ్వర్యంలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

మత్స్యకారుడి వలలో 32 కిలోల భారీ చేప