జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 28 హన్మకొండ ప్రతినిధి:-
హన్మకొండలో గవర్నర్ జిష్ను దేవ్ వర్మతో కలిసి మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క పర్యటించారు.. గవర్నరుతో కలిసి వెయ్యి స్థంబాల గుడిని సందర్శించారు. గవర్నర్, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క వెయ్యి స్థంబాల గుడిలో శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వెయ్యి స్థంబాలగుడిలో డాక్యూమెంటరీ వీక్షించార. భద్రకాళిఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన గవర్నర్, మంత్రులు. ఖిలా వరంగల్ కోటను సందర్శించి కాకతీయుల చరిత్రను తెలుసుకున్న గవర్నర్. ఖీలా వరంగల్ లో కాకతీయ కీర్తి తోరణం వద్ద పేరిణి నృత్యం, రాణి రుద్రమ నాటకాన్ని గవర్నర్, మంత్రులు. వీక్షించారు,.