జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ ఆగస్టు 28
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా హనుమకొండ కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలోని ప్రముఖులతో సమావేశమయ్యారు. ఇందులో భాగంగా జాతీయ రాష్ట్రపతి అవార్డు గ్రహీత ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతితో గవర్నర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులను గెలుచుకునే విధంగా కృషి చేయాలని సూచించారు. ఎంతో కష్టపడితే గాని జాతీయస్థాయిలో అవార్డు అందుకోలేరని, సామాజిక సేవలో నిరంతరం కొనసాగాలని విద్యార్థులను, యువతను జాతీయ సేవకు సన్నద్ధం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఉన్నత విద్య ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్ర వెంకటేశం, హనుమకొండ, వరంగల్ కలెక్టర్ తో పాటు అధికారులు పాల్గొన్నారు.