*రామ్ నగర్ బంజారా కాలనీలో నిర్వహించిన తీజ్ వేడుకల్లో పాల్గొన్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే*
హనుమకొండ/రామ్ నగర్ జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 29 హనుమకొండ ప్రతినిధి:-
హనుమకొండ 52వ డివిజన్ రాంనగర్ (బంజారా కాలని)లో నిర్వహీంచిన తీజ్ వేడుకల్లో పాల్గొని పూజలు చేసిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి. లంబాడి సోదరుల పండుగల్లో అతి ప్రత్యేకమైన తీజ్ వేడుకల పుణ్యఫలం ద్వారా మంచి జరగాలని సోదర సోదరిమనులకు తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. కాలనిలో ఏమైనా సమస్యలు ఉన్న నాదృష్టికి తీసుకు రావాలని తక్షణమే వారిని పరిష్కరిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.