జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ ఆగస్టు 29 గ్రేటర్ వరంగల్ నగరంలో ఈనెల 31, సెప్టెంబర్ 1వ తేదీలలో సరూర్‌నగర్, హైదరాబాద్ లో జరుగనున్న తెలంగాణ రాష్ట్రస్థాయి యోగా పోటీలకు శాయంపేట మండలం, పత్తిపాక ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు బి.మాధవి, వ్యాయామ ఉపాధ్యాయులు బి.కమలాకర్ లు తెలిపారు. వరంగల్, హనుమకొండ జిల్లా స్థాయిల విద్యార్థుల ఎంపిక పోటీలు ఈ నెల 25, 26 తేదీలలో రంగశాయిపేట బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించగా, పత్తిపాక ఉన్నత పాఠశాల విద్యార్థులు అండర్ 18 విభాగంలో గాదె సాయి పణయ్(బంగారు పతకం), గడ్డి నవదీప్ (కాంస్యం), అండర్ 16 విభాగంలో గజ్జి వరుణ్(బంగారు పతకం), గజ్జి రాజేష్, ఎమ్డీ.సాల్మాన్ (రజతం), అండర్ 10 విభాగంలో ప్రాథమిక పాఠశాలకు చెందిన దైనంపల్లి మనోజ్ కుమార్ (బంగారు పతకం), గజ్జి విజ్ఞాన్ (రజతం) లు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని వారు వివరించారు. విద్యార్థులకు యోగాలో శిక్షణనిచ్చిన కోచ్ వ్యాయామ ఉపాధ్యాయుల కమలాకర్‌ను, విద్యార్థులను ప్రాథమిక పాఠశాల పుధానోపాధ్యాయులు టి.శ్రీనివాస్, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు రఘు, సాంబాబు శర్మ, అనిత, విజయ, కిరణ్మయి, విజయ్ కుమార్, వసంత లు అభినందించారు.
previous post