జై భారత్ వాయిస్ న్యూస్ సంగెం ఆగస్టు 29
గిరిజన సంస్కృతీ, సంప్రదాయాలకు తీజ్ వేడుకలు ప్రతీకగా నిలుస్తాయని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు.గురువారం రాత్రి సంగెం మండలం చింతలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని వాలు నాయక్ తండా, మట్యా నాయక్ తండాలలో జరిగిన తీజ్ ఉత్సవాలలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తీజ్ పండగ సందర్భంగా గోధుమ బుట్టలు నెత్తిన పెట్టుకొని గిరిజనులతో కలిసి నృత్యం చేశారు.ప్రకృతిని ఆరాధిస్తూ గొప్పగా పూజించే తీజ్ ఉత్సవాల్లో పాల్గొని, గిరిజనులందరికి తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతిని ఆరాధిస్తూ జరుపుకునే తీజ్ ఉత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందని, మన ఆచారాలు, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు.అనంతరం డప్పు వాయిద్యాల మధ్య మొలకల బుట్టలతో ఊరేగింపు చేస్తున్న గిరిజన యువతులతో కలిసి ఎమ్మెల్యే నృత్యం చేశారు భిన్నత్వాలకు ఆలవాలమైన భారతదేశంలో ప్రతి ఒక్కరూ వారి పద్ధతుల్లో సర్వమానవాళి శ్రేయస్సు, పర్యావరణహితం కోసం ఉత్సవాలు నిర్వహిస్తారని తెలిపారు
https://play.google.com/store/apps/details?id=com.Jai_Bharat_voice.apps