జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 29 వరంగల్ జిల్లా ప్రతినిధి:
బిసి కులగణన ప్రక్రియ తక్షణమే ప్రారంభించాలని కోరుతూ ఆమరణ నిరాహార దీక్ష 5 వ రోజుకు చేరుకుంది. గీసుకొండ మండల కేంద్రంలో చాపర్తి కుమార్ గాడ్గే మాట్లాడుతూబీసీలకు స్టానిక సంస్థల్లో 42% అమలు చేయాలి, సమగ్ర కుల జనగణన చేపట్టాలి, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలీ. లేకుంటే మాప్రాణాలు అర్పించైన బీసీలను చైతన్యం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక సంస్థలు ఓటు ద్వారా బుద్ధి చెప్పి ఓడిస్తామని హెచ్చరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది రాచకొండ ప్రవీణ్ కుమార్, తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెంట అజయ్ పటేల్ తీన్మార్ మల్లన్న టీం పాలకుర్తి నియోజకవర్గ ఇంచార్జ్ గుంటుక నవ్య ముదిరాజ్, మామునూరు మాజీ సర్పంచ్ అరుణ హాసనపర్తి మండల కేంద్రం బీసీ నాయకులు రెబ్బ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
previous post