Jaibharathvoice.com | Telugu News App In Telangana
ములుగు జిల్లా

జె చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు సమీక్ష సమావేశంలో పాల్గొన్న కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 30 ములుగు ప్రతినిధి:-
దేవాదుల ఎత్తిపోతల పథకం పురోగతిపై నీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్కతో కలిసి శుక్రవారం నాడు దేవాదుల ఎత్తిపోతల పథకం పురోగతిని తెలుసుకొనేందుకు నీటిపారుదల శాఖ అధికారులతో, ఎమ్మెల్యేలతో కలిసి ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం దేవాదుల ఎత్తిపోతల పథకం శిలా ఫలకం, ఇంటెక్ వెల్, ఎత్తిపోతల మోటార్లను పరిశీలించిన అనంతరం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..రెండు దశబ్దాలుగా సాగుతున్న జె చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేసేందుకు ప్రభుత్వం లక్ష్యం నిర్ణయించుకుంది అని, ఎట్టి పరిస్థితుల్లోను 2025 డిసెంబర్ నాటికి ప్రాజెక్ట్ లోని అన్ని దశలను పూర్తిచేసి 7 జిల్లాలను సస్య శ్యామలం చేసే దిశగా పని చేస్తున్నామని అన్నారు.

Related posts

బతుకమ్మ సంబరాల్లో సీతక్క

Jaibharath News

మేడారం సమ్మక్క సారక్క ఆశీస్సులతో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డది

Jaibharath News

కట్టు బొట్టు మన ఆచార సంప్రదాయాలను కాపాడుకోవాలి.