హన్మకొండ//హంటర్ రోడ్డు
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 30 హన్మకొండ ప్రతినిధి:-
హనుమకొండ బస్టాండ్ లో డైరెక్టర్ మధుర శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న కొత్త సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు పాల్గొన్నారు. అలాగే హంటర్ రోడ్ లో మాజీ ఎంపీ పసునూరి దయాకర్ డి కన్వెన్షన్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు పాల్గొన్నారు. అనంతరం వరంగల్ తూర్పు నియోజకవర్గం ఓ సిటీలోని కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు ప్రజల నుంచి విజ్ఞప్తులను వినతులను స్వీకరిస్తు ప్రజల సమస్యలను సావధానంగా వింటూ సంబంధిత శాఖల అధికారులతో అప్పటికప్పుడే ఫోన్ లో మాట్లాడి సమస్యలను పరిష్కరించారు. దీర్ఘకాలంగా వేచి చూస్తున్న తమ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంతో ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవు తున్నాయి. ప్రజలకు ఎల్లవేళలా కొండా దంపతులు అందుబాటులో ఉంటారని ఏ సమస్యలున్నా ప్రజలు ఎలాంటి పైరవీలు చేయకుండా నిరభ్యంతరంగా తనను సంప్రదించవచ్చునని కార్యకర్తలకు నాయకులకు ఏ ఆపద వచ్చిన కొండా దంపతులు కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఈ సందర్భంగా కొండా మురళీధర్ రావు ప్రజలకు మరోసారి స్పష్టం చేశారు.
