Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు నియంత్రించాలి: ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు ప్రశాంత్

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 30 పరకాల ప్రతినిధి:-
ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులను తగ్గించాలని ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు మడికొండ ప్రశాంత్ జిల్లా విద్య శాఖ అధికారి కార్యాలయంలో సూపరింటెండెంట్ శారదకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ నిబంధాలకు విరుద్ధంగా పరకాల పట్టణంలోని ప్రైవేటు స్కూల్లలో ఇష్టానుసారంగా ఫీజులను వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకుంటున్నారని, పాఠశాలలల్లో కనీస సౌకర్యాలు లేవని, స్కూల్లలోనే పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ స్టేషనరీ అమ్ముతున్నారని, విద్యార్థులకు ఆడుకోవడానికి ఆటస్థలం లేదని కనీసం మూత్రశాలులు, మరుగుదొడ్ల సౌకర్యం కూడ సరిపడలేవని, ఫీజులను మాత్రం ఇష్టానుసారంగా పెంచి వసూలు చేస్తున్నారని, విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని, గతంలో అనేకసార్లు ఫిర్యాదు చేసిన, స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు పాఠశాలల యజమాన్యాలు సిండికేటుగా వ్యవహరిస్తున్నారని, విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని, ప్రభుత్వం, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Related posts

flash..బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్

నీరుకుల్ల గ్రామంలో సంచరిస్తున్న పునుగు పిల్లులు

ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కల్సిన సిపి

Jaibharath News