జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 30 వరంగల్ ప్రతినిధి:-బీసీకులగణన మరియు 42% రిజర్వేషన్ కామారెడ్డి డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని గీసుకొండ మండల కేంద్రంలో ఆరు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రజక పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బీసీ నేత చాపర్తి కుమార్ గాడ్గే దీక్షకు సంఘీభావం తెలిపి మద్దతు ప్రకటించిన తెలంగాణ బీసీ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాయిని భరత్. తెలంగాణ బీసీ ప్రజా సంఘం రాష్ట్ర మహిళా కన్వీనర్ చిత్తారి రజిత, జిల్లా ప్రధాన కార్యదర్శి మేడిపల్లి శ్రీలత, వరంగల్ నగర అధ్యక్షురాలు తోట సాగరిక, రాష్ట్ర యువజన నాయకులు బెజ్జాల కోటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయిని భరత్ మాట్లాడుతూ చాపర్తి కుమార్ దీక్ష డిమాండ్లను వెంటనే ప్రభుత్వం అమలు చేయాలి కుమార్ గాడ్గేకి ఏమైనా కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు.
