(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు):
వినాయక నవరాత్రుల పర్వదినాన్ని పురస్కరించుకొని అందరూ భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహించుకోవాలని ఆత్మకూరు ఎస్సై పరమేశ్వర్ అన్నారు. శుక్రవారం ఆత్మకూరు మాడ్రన్ పోలీస్ స్టేషన్లో ఆత్మకూరు మండలంలో వినాయక నవరాత్రులు నిర్వహించే భక్తులతో ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో మాట్లాడారు. గణనాధునికి కులమతాలకు అతీతంగా అందరు కలిసి వేడుకలు నిర్వహించుకోవాలి. ఇలాంటి ఘర్షణలకు తావు ఇవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత నిర్వాహకులపై ఉందన్నారు. భక్తులందరూ కలిసి నవరాత్రులు పూజలు నిర్వహించిన అనంతరం అంతే భక్తిశ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలన్నారు. ఈ పండుగైన అందరి కలిసి సంబరాలు నిర్వహించుకుంటేనే ఆనందంగా ఉంటుందన్నారు