Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి :ఆత్మకూరుసిఐ సంతోష్

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు): రేపటి సమాజానికి విద్యార్థులు దిక్సూచి కావాలని అదేవిధంగా మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఆత్మకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సంతోష్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని సెయింట్ థెరిస్సా పాఠశాలలో విద్యార్థులకు మత్తుపదార్థాలు ఇతర డ్రగ్స్ పట్ల అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ కొన్ని ఏరియాల్లో విద్యార్థులు డ్రగ్ మాఫియా చేతిలోకి చిక్కి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని దీంతో తల్లిదండ్రులను తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నారని అని తెలిపారు . ప్రతి విద్యార్థి బంగారు భవిష్యత్తును తుంచుకోవద్దని క్రమశిక్షణతో చదువుకొని సమాజంలో ఉత్తమమైన మార్గాలను ఎంచుకొని ఉన్నతమైన ఉద్యోగాలను చేపట్టాలని అప్పుడే సమాజం అందరినీ గౌరవిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ జాయ్స్, వైస్ ప్రిన్సిపాల్ రోస్ మీ, పాఠశాల కరస్పాండెంట్ లిస్ మేరి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

కటాక్షపురం చెరువు లో ఘనంగా గణనాధుల నిమజ్జనం

ఫిర్యాదులపై తక్షణమే కేసులు నమోదు చేయండి

ఇస్రో కోఆర్డినేటర్లుగా జితేందర్, సరిత నియామకం!