*దేవాలయాల ప్రతిష్టాపన కార్యక్రమాలలో పాల్గొన్న కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి* వరంగల్ జిల్లా//సంగెం మండలం//గవిచర్ల జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 31 వరంగల్ ప్రతినిధి:-
సంగెం మండలంలోని గవిచర్ల గ్రామంలో శ్రీ గుండా బ్రహ్మయ్య దేవాలయం భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమంలో మరియు కాట్రపల్లి గ్రామంలోని పోచమ్మ మరియు అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మరియు కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి. ఈ సందర్భంగా ఆలయ పూజారులు ఘనంగా స్వాగతం పలికీ, వేద మంత్రోచ్ఛారణలతో ఆలయంలోనికి తీసుకెళ్లారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.