*బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం లో పాల్గొన్నా పరకాల కాంటెస్ట్ ఎమ్మెల్యే డా,, ఖాళీ ప్రసాద్*
వరంగల్ జిల్లా// గీసుకొండ మండలం//ధర్మారంజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 31 వరంగల్ ప్రతినిధి:-
భారతీయ జనతా పార్టీ సంస్థాగత సభ్యత్వ నమోదు కార్యక్రమం సందర్భంగా జాతీయ పార్టీ ఆదేశాల మేరకు మండల స్థాయి సభ్యత్వ నమోదు కార్యశాల కోటగండి లోని వరంగల్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమనికి ముఖ్యతిథిగా బీజేపీ పరకాల కాంటెస్ట్ ఎమ్మెల్యే డా. పగడాల ఖాళీప్రసాద్ హాజరు అయ్యి సభ్యత్వ నమోదు పట్ల కార్యకర్తలకు దిశ నిర్ధేశం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గీసుగొండ మండల అధ్యక్షుడు జాన్ విక్రమ్, మండల ప్రధాన కార్యదర్శి కొంగర రవికుమార్ 17వ డివిజన్ అధ్యక్షుడు నవీన్, 16 వ డివిజన్ అధ్యక్షుడు గోదాసి అశ్విన్, 15 వ డివిజన్ అధ్యక్షుడు బిళ్ళ రమేష్, అసెంబ్లీ కన్వీనర్ ముల్కప్రసాద్, రాష్ట్ర కౌన్సిల్ మెంబెర్ గటికొప్పుల రాంబాబు, హన్మకొండ జిల్లా ఉపాధ్యక్షుడు నర్శింగరావు, వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడు పగడాల రాజకుమార్, జిల్లా కార్యదర్శి కూతురు రాజు, చోక్కం శ్రీనివాస్, గట్ల భిక్షపతి, బీజేవైఎం మండల అధ్యక్షుడు అడువల అఖిల్, నాగరాజు, బుర్గుల యుగేందర్ మరియు జిల్లా మండల డివిజన్ పదధికారులు వివిధ మోర్చాల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.