*ఎస్ఎఫ్ఐ పరకాల కమిటీ ఆధ్వర్యంలో ఎంఈఓ ఆఫీస్ ముందు ధర్నా* హన్మకొండ జిల్లా//పరకాల జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 31 పరకాల ప్రతినిధి:-
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎంఈఓ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడు బొజ్జ హేమంత్ పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్ మాట్లాడుతూ.. పరకాల పట్టణంలో స్థానిక ఎంఈఓ 4 మండలాలు ఇన్చార్జిగా ఉండడం వల్ల విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఏ మండలానికి వెళ్లిన ఎంఈఓ ఆఫీసులో ఎంఈఓ లేక విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ ఎంఈఓలను వెంటనే నియమించాలన్నారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల విద్యారంగ సమస్యలు పరిష్కరించలేక తీవ్రమైన ఇబ్బందులు గురవుతున్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలి ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి సాయి తేజ భరత్ మహేష్ సాయి పాల్గొన్నారు.