Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ఘనంగా ఉద్యోగ విరమణ సన్మానం

ఘనంగా ఉద్యోగ విరమణ సన్మానం.-

శ్రీనివాసరావు సేవలు ఆదర్శం- (జై భారత్ వాయిస్ ఆత్మకూరు): నల్లబెల్లి మండల విద్యా నోడల్ అధికారి, రంగాపురం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోత్కూరి శ్రీనివాసరావు ఉద్యోగ విరమణ సందర్భంగా మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్ లో జరిగిన సన్మాన ఘనంగా జరిగింది. రంగాపురం ఉన్నత పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు తూముగంటి రఘువీర్ అధ్యక్షతన జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న నల్లబెల్లి ఎండిఓ నరసింహమూర్తి మాట్లాడుతూ శ్రీనివాసరావు మండల విద్యా నోడల్ అధికారిగా, రంగాపూర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా విద్యారంగానికి సేవలు అందించారని ఆయన తెలిపారు. ఉపాధ్యాయులంతా శ్రీనివాసరావును ఆదర్శంగా తీసుకోవాలని ఆయన కోరారు. ఉద్యోగ ఉద్యోగంలో పదవి విరమణ తప్పనిసరి అని ప్రతి ఒక్కరూ బాధ్యతతో అంకితమై పనిచేయాలని ఆయన కోరారు. ఏం ఈ ఓ చదువుల సత్యనారాయణ మాట్లాడుతూ శ్రీనివాస్ రావు ఎందరో విద్యార్థులను తీర్చి దిద్దారని అన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగ విరమణ పొందుతున్న మోతుకూరి శ్రీనివాసరావు- గీతా దంపతులను ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నల్లబెల్లి ఎంఈఓ చదువుల సత్యనారాయణ, వరంగల్ జిల్లా పీఆర్టీయూ ప్రధాన కార్యదర్శి గఫార్, మండల పిఆర్టియు అధ్యక్షుడు నకిరెడ్డి మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఉడుత రాజేందర్, మండల యూటీఎఫ్ బాధ్యుడు రవుఫ్ డి సి ఈ బి కార్యదర్శి కృష్ణమూర్తి, రంగాపురం మాజీ సర్పంచ్ చీకటి ప్రకాష్, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాశం సంజీవరెడ్డి, రమేష్, ఎల్ సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో వ్యాఖ్యాతగా ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు డాక్టర్ కందాలరామయ్య వ్యవహరించారు. ఈ సందర్భంగా ఉద్యోగ విరమణ పొందుతున్న మోత్కూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ తన వంతు బాధ్యతగా విద్యారంగానికి అంకితమై సేవలు అందించానని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యత తో పని చేయాలని కోరారు.ఈ కార్యక్రమం లో విద్యార్థులు, వివిధ మండలాల నుంచి పూర్వ విద్యార్థులు, ఉన్న త, ప్రాథమిక, పాఠశాల ల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Related posts

న్యూ శాయంపేట పోచమ్మ తల్లి బోనాల జాతరలో సతీసమేతంగా పాల్గొన్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే

నిర్బంధాలతో బీ.ఆర్.ఎస్ కార్యకర్తల్ని అణచలేరు

సుదర్శనాచార్యులు అర్చకుడి జన్మదినం సందర్భంగా మజ్జిగ వితరణ