*భారీ వర్షాల పట్ల పరకాల నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి*వరంగల్ జిల్లా//పరకాల నియోజకవర్గంజై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 1 వరంగల్ ప్రతినిధి:-
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గీసుకొండ మండల బిఆర్ఎస్ యువజన అధ్యక్షులు శిరిసే శ్రీకాంత్ అన్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రజలందరూ జాగూరతతో మేదలాలి. మరి ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నాలాలు, మ్యాన్‌హోల్స్ దగ్గర జాగ్రత్తగా ఉండాలని అన్నారు.ఎట్టి పరిస్థితుల్లోనూ కరెంటు పోల్స్ దగ్గరకు వెళ్లొద్దు. రానున్న రెండు రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున చిన్న పిల్లలను బయటకు వెళ్లకుండా చూసుకోవాలి. ఈ భారీవర్షాలకు ప్రజలు అవసరమైతే తప్ప బయటికి రావద్దు. శిధిలావస్థలో ఉన్న ఇళ్లల్లో నివసించే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి.