*కొత్తగూడా మండలంలోని వాగులను పరిశీలిస్తున్న తహసిల్దార్, ఎస్ఐ* రెండు మండలాలు సుమారు 36 గ్రామపంచాయతీలకు రాకపోకలకు అంతరాయం. మహబూబాబాద్ జిల్లా//కొత్తగూడా జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 1 నర్సంపేట ప్రతినిధి:-
కొత్తగూడ మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు ఉదృతం కావడంతో నర్సంపేట నుండి కొత్తగూడకు వచ్చే గేదవాగు. ముసలమ్మవాగు కొత్తగూడ మండలంలోని వేలుబెల్లి కత్తెరవాగు, కొత్తపల్లివాగు. గుంజేడువాగు, మొండ్రాయి గూడెంవాగు. నాజ తండ దగ్గర ఉన్న పాకాలవాగు ప్రవహిస్తుండడంతో కొత్తగూడ గంగారం ఏజెన్సీ మండలాలలోని గ్రామాలకు రాకపోకలకు అంతరాయంగంగారం మండలంలోని 12 గ్రామ పంచాయతీలకు గ్రామాలకు కొత్తగూడ మండలంలోని 24 గ్రామ పంచాయతీలకు పూర్తిగా రాకపోకలకు ఆటకం. గర్భిణీ స్త్రీలు ముందు జాగ్రత్తగా హాస్పిటలుకి వెళ్లాలని అధికారుల సూచన. వాగులు దాటోద్దని కౌన్సిలింగ్ చేస్తున్న పోలీసులు. వాగులను పరిశీలిస్తున్న తాసిల్దార్ రమాదేవి ఎస్ఐ కుశ కుమార్.