*వరదల్లో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు సహాయం కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు*
వరంగల్ జిల్లా//నెక్కొండ// వెంకటాపురం//
జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 1 నర్సంపేట ప్రతినిధి:-
నెక్కొండ మండలం వెంకటాపురం చెరువు కట్ట మీద వరదలో చిక్కున్న ఆర్టీసీ బస్సు. దిక్కుతోచని పరిస్థితిలో 45 మంది ప్రయాణికులు. వరంగల్ నుండి మహబూబాబాద్ వెళ్తున్న TS24Z 0018 నెంబరు గల ఆర్టీసీ బస్సు నెక్కొండ – వెంకటాపురం చెరువు కట్ట పైన నిన్న రాత్రి వరద ప్రభావంతో చిక్కుకు పోయింది. రాత్రి నుండి ఇప్పటివరకు ముందుకు వెనకకు పోలేక ప్రాణాపాయ పరిస్థితిలో సహాయంకోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులు.