Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

నెక్కొండ మండలం వెంకటాపురం వాగులో చిక్కుకున్న బస్సులోని ప్రయాణికులను కాపాడిన లారీ డ్రైవర్

*నెక్కొండ మండలం వెంకటాపురం వాగులో చిక్కుకున్న బస్సులోని ప్రయాణికులను కాపాడిన లారీ డ్రైవర్* వరంగల్ జిల్లా//నెక్కొండ మండలం// వెంకటాపురం గ్రామంజై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 1 నర్సంపేట ప్రతినిధి:-వరంగల్ జిల్లా నెక్కొండ మండలం వెంకటాపురం అలుగులో బస్సులోని ప్రయాణికులు చిక్కుకున్నారని తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా వెంకటాపురం వెళ్లి ప్రయాణికులను సురక్షితమైన ప్రాంతానికి చేర్చేలా చర్యలు తీసుకున్నారు. ఎదురుగా వస్తున్న లారీ డ్రైవర్ బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను లారీలో ఎక్కించుకొని సురక్షితమైన ప్రాంతానికి తరలించడంపై డ్రైవరును అభినందించిన కలెక్టర్. ప్రయాణికుల యోగక్షేమాలు తెలుసుకొని వారిని మండల ప్రజా పరిషత్ పాఠశాలలోని పునరావాస కేంద్రానికి సురక్షితంగా తరలించిన కలెక్టర్. ప్రయాణికులకు అవసరమైన వసతులు భోజనం కల్పించారు.ఈ సందర్భంగా ప్రయాణికులకు సురక్షితంగా చేర్చడం కొరకు సహాకరించిన రెవిన్యూ, పోలీసు అధికారులు, గ్రామ ప్రజలను కలెక్టర్ అభినందించారు.

Related posts

పేదల కాలనీలకు తక్కువ ధరకే కరెంట్ మీటర్లు కార్పొరేటర్ బోగి సువర్ణ సురేష్

Sambasivarao

గీసుకొండ హైస్కూల్ లో ఘనంగా SSC 1990-91 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

బిజెపి నర్సంపేట నియోజకవర్గం సభ్యత్వ నమోదు కార్యక్రమం

Sambasivarao