Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే నాయిని

*భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే నాయిని*

హన్మకొండ
జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 1 హన్మకొండ ప్రతినిధి:-

కాంగ్రెస్ శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలుపు.
ఎడతెరాపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఉదయం నుంచి వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి హనుమకొండ లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. భారీ వర్షాల పరిస్థితిలలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్పా బయటకు రావొద్దని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్లు, శ్రేణులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, సహాయక చర్యల్లో పాలుపంచు కోవాలని పిలుపునిచ్చారు. భారీ వర్షాల నేపథ్యంలో నాయింనగర్ బ్రిడ్జి క్రింద నుంచి నీరు సజావుగా వెళ్తున్న తీరు పరిశీలించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Related posts

బాసాని సుదర్శనం జ్ఞాపకార్థం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బూట్లు పంచిపెట్టిన బాసాని కుటుంబం

Sambasivarao

ఓరుగల్లు భద్రకాళి దేవాలయం లో శాకంబరి నవరాత్రి మహోత్సవాలు

వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పేరుతో ఫేక్ మెసేజ్ లు జరభద్రం