*భారీ వర్షాల నేపథ్యంలో వరంగల్ తూర్పులోని లోతట్టు ప్రాంతాలలో పర్యటించిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు*
వరంగల్
జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 1 వరంగల్ ప్రతినిధి:-
భారీ వర్షాల నేపథ్యంలో తల్లడిల్లుతున్న ప్రజల కోసం నేనున్నాను అంటూ లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు. అధైర్య పడొద్దు అండగా ఉంటాం మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు. కాంగ్రెస్ శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలుపు.
వరదల వలన ముంపుకు గురైన బాధితులను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రెవెన్యూ సిబ్బందికి సూచించిన కొండా మురళీధర్ రావు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఉదయం నుంచి మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్ రావు వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని బిఆర్ నగర్, ఎంఎన్ నగర్, ఎన్టీఆర్ నగర్, అండర్ బ్రిడ్జ్, తెలంగాణ కాలనీ, ప్రాంతాల్లో పర్యటించారు. భారీ వర్షాల పరిస్థితులలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదని తెలిపారు. అతి భారీ వర్షాల నేపద్యంలో అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని రోడ్లపై వరద నీటిని స్థానిక సంస్థ సిబ్బంది క్లియర్ చేయాలని విద్యుత్ సరఫరా త్రాగునీటి సరఫరా ఎప్పటికప్పుడు పునరుద్ధరణ చేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. భారీ వరదలు వచ్చే నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. అతి భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అధికార యంత్రంగానికి సంపూర్ణంగా సహకరించాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులకు, ప్రజలకు అందుబాటులో ఉండాలని సాయక చర్యల్లో పాలుపంచు కోవాలని పిలుపునిచ్చారు.