Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

వరంగల్లో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే నాయిని పిలుపు

*వరంగల్లో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే నాయిని పిలుపు*

హన్మకొండ

జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 1 హనుమకొండ ప్రతినిధి:-

వరంగల్ పశ్చిమ నియోజక వర్గంలో అత్యధికంగా వర్షపాతం నమోదు అవుతున్న పరిస్థితుల్లో అన్ని ప్రాంతాల ప్రజలు మరీ ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.అత్యధిక వర్షపాతం నమోదైన గతంలో కంటే తక్కువ నష్టం వాటిల్లే పరిస్థితి రావడంలో మా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి కనపడుతుందన్నారు.

కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరు ప్రజలకు అందుబాటులో ఉండు, సహాయక చర్యల్లో పాల్గొనాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కోరారు.ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలతో నగరంలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే నాయిని. గత పదేళ్ల పనికిమాలిన చర్యల వలన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల్లోనే చాలా వరకు వరద ప్రభావిత ప్రాంతాలను అభివృద్ధి చేశామని, నాయింనగర్ బ్రిడ్జి ప్రారంభం కాగానే గోకుల్ నగర్, అంబేద్కర్ నగర్, గాంధీనగర్ లలో నాలా పనులు మొదలు పెడుతామన్నారు. ఇప్పటికే దాదాపు రూ. 5 కోట్లపై చిలుకు నిధులు జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేశామని గుర్తు చేశారు. వచ్చే వర్షాకాలం నాటికి వర్షాకాలంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వ యంత్రంగా అంతకుడా ఎప్పటికప్పుడు పరిస్థితులపై పర్యవేక్షణ జరుగుతుందని తెలిపారు. వచ్చే రెండు మూడు రోజులు ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజలకు కావాల్సిన పునరావాస సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు, యువకులు కానీ ఎప్పటి కప్పుడు సమాచారం అందించాలని పేర్కొన్నారు.

Related posts

ఘనంగా ఉద్యోగ విరమణ సన్మానం

రంగాపురం లో ఘనంగా గురు పుజోత్సవం

Jaibharath News

తహశీల్దార్ కు వినతి పత్రం అందజేసిన నర్సంపేట డివిజన్ జర్నలిస్ట్ నాయకులు

Jaibharath News