*గీసుకొండలో రేవూరి జన్మదిన వేడుకల సందర్భంగా అన్నదానం నిర్వహించిన సమన్వయ కమిటీ సభ్యులు*
వరంగల్ జిల్లా//గీసుకొండ మండలం జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 1 వరంగల్ ప్రతినిధి:-
మండలములోని యస్ యస్ గార్డెన్ లో పరకాల నియోజకవర్గ శాసన సభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి 71 వ జన్మదిన వేడుకలు గీసుకొండ మండల పార్టీ అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యం ఘనoగా నిర్వహించారు. భారీ కేక్ కట్ చేసి, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ రానున్న మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించాలని అన్నారు. రేవూరి ప్రకాశ్ రెడ్డి ఎంఎల్ఏ కావటం పరకాల ప్రజల అదృష్టమన్నారు. ఈ కార్యక్రమములో టిపిసీసీ ప్రధాన కార్యదర్శి భీమగాని సౌజన్య, అధికార ప్రతినిధి చాడ కొమురారెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు వీరగోని రాజ్ కుమార్, అల్లం బాల కిశోర్ రెడ్డి, సమన్వయ కమిటీ సభ్యులు ఆకుల రుద్ర ప్రసాద్, కూసం రమేష్, పత్తిపాక రవీందర్, వాంకుడోత్ గోపాల్, నకినబోయిన నాగరాజు, పాషా, వివిధ గ్రామాల గ్రామ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు 500 మంది పాల్గొన్నారు.