*గీసుకొండలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి జన్మదిన వేడుకలు* వరంగల్ జిల్లా//గీసుకొండజై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 1 వరంగల్ ప్రతినిధి:-పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి జన్మదినము సందర్భంగా గీసుకొండలో కాంగ్రెస్ పరకాల నియోజకవర్గ అధికార ప్రతినిధి చాడ కొముర రెడ్డి ఆధ్వర్యంలో గీసుకొండ లోని బసవేశ్వర శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినారు. ఆ తర్వాత ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా చాడ కొమరా రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారు నిండు నూరేళ్లు జీవించాలని పరకాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ఆ దేవుని వేడుకుంటూ తాటికొండ నరేందర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే 71 వ పుట్టినరోజు సందర్భంగా 71 కొబ్బరికాయలు కొట్టి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాబేటి నరేందర్ వరిగల రాజు బోడకుంట్ల రాజకుమార్ దౌడు బాబు ధోనికల రాములు తదితరులు పాల్గొన్నారు.
